Take a fresh look at your lifestyle.

పేగు బంధం మరిచి ప్రేమ మోజులో తల్లిదండ్రులనే కడతేర్చింది

ప్రియుడి ప్రేమ మోజులో పడి తల్లిదండ్రులను కడతేర్చిన కూతురు – తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి చంపిన కుమార్తె
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి ప్రేమ మోజులో పడి తల్లిదండ్రులకు కుమార్తె విషం ఇంజక్షన్‌ ఇచ్చి హతమార్చింది. పేగు బంధం మరచి ప్రేమ మోజుతో తల్లిదండ్రులని కడతేర్చిన కూతురు ఉదంతం వెలుగులోకి వచ్చింది. కని పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకురాలిగా చేసి నర్సుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించిన పాపానికి తల్లిదండ్రులను కడతెరిచింది ఆ కూతురు. కాళ్ల నొప్పులు తగ్గుతాయని మత్తుమందు ఇంజక్షన్ మొదట తల్లికి ఆ తర్వాత తండ్రికి అధిక డోలు ఇంజక్షన్ చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందారు. ఇది గమనించిన కూతురు, సోదరునికి ఫోన్ చేసి అమ్మానాన్న అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి చేరుకొని తల్లిదండ్రులు ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు తమకేమీ తెలియనట్టు నటిస్తున్న కూతురు పట్ల పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం తెలియ వచ్చింది. మొదట అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తొలుత భావించినా.. పోలీసుల విచారణలో కుమార్తె బండారం బట్టబయలైంది.

Leave A Reply

Your email address will not be published.