రిఫ్రెష్డ్ మరియు అప్‌గ్రేడెడ్ సరికొత్త Kushaq ధరలను స్కోగీ ఇండియా ప్రకటించడమే కాకుండా, కస్టమర్ డెలివరీలను కూడా ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించబడిన కొత్ కుశాగ్.. భద్రత మరియు డ్రైవింగ్ డైనమిక్స్‌లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా, యూరోపియన్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే బ్రాండ్ వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. సెగ్మెంట్-ఫస్ట్ ఎయిట్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, రియర్ సీట్ మసాజర్ మరియు అనేక కొత్త స్టాండర్డ్ ఫీచర్లతో వస్తున్నకుశాక్ 1.0 TSI మరియు 1.5 TSI వేరియంట్లు, యూరోపియన్ ఇంజనీరింగ్ మరియు 5-స్టార్ భద్రతను భారతీయ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. కొత్త కుశాక్ ఇప్పుడు Classic+, Signature, Sportline, Prestige మరియు Monte Carlo అనే ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఇవి టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లతో పాటు మాన్యువల్ మరియు రియల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను అందిస్తున్నాయి. కస్టమర్లు తమకు నచ్చిన ఎనిమిది రంగులను ఎంచుకోవచ్చు: క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్, లావా బ్లూ, డీప్ బ్లాక్ మరియు సరికొత్తగా పరిచయం చేసిన షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే, మరియు చెర్రీ రెడ్.
ఈ సందర్భంగా స్కోడా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, స్కోడాలో తమ ప్రధాన లక్ష్యం యూరోపియన్ టెక్నాలజీని అందరికీ చేరువ చేయడమేనన్నారు. కొత్త కుశాగ్ తో తాము ప్రతి వేరియంట్‌లోనూ వాల్యూకి సరికొత్త అర్థాన్ని ఇచ్చామని, పోటీతత్వ ధరలు, మెరుగైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు మరియు ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో కొత్త Kushaq అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సెగ్మెంట్-ఫస్ట్ ఎయిట్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, రియర్ సీట్ మసాజర్ మరియు ఎంట్రీ వేరియంట్ నుండి అవసరమైన ఫీచర్లను స్టాండర్డైజ్ చేయడం ద్వారా కస్టమర్లకు అద్భుతమైన వాల్యూను అందిస్తున్నామని వెల్లడించారు.