కూలింగ్ ఉత్పత్తుల్లో సరికొత్త శ్రేణి
బ్లూస్టార్ కొత్త ఆవిష్కరణ
తదుపరి దశ వృద్ధికి దోహదపడేలా సమగ్రమైన యూనిటరీ కూలింగ్
2026 కోసం సరికొత్త రూమ్ ఎయిర్ కండీషనర్ల శ్రేణి
ముద్ర, బిజినెస్ :
భారత్‌లో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కూలింగ్ సెగ్మెంట్లలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా బ్లూస్టార్ లిమిటెడ్ 2026 వేసవి కోసం సరికొత్త రూమ్ ఎయిర్ కండీషనర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఈ సమగ్రమైన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల కస్టమర్ల అవసరాలు, వినియోగ వాతావరణాలకు అనుగుణంగా ఫ్లాగ్‌షిప్ ప్రీమియం రేంజి ఉత్పత్తులతో పాటు రూమ్ ఎయిర్ కండీషనర్లకు సంబంధించి 125 మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE) ప్రమాణాలకు తగ్గట్లుగా ఉంటాయి. వివిధ అవసరాలకు అనుగుణంగా, విద్యుత్తును ఆదా చేసే, అత్యంత సమర్ధవంతమైన కూలింగ్ సొల్యూషన్స్‌కి నెలకొన్న డిమాండును తీర్చే విధంగా ఈ మోడల్స్ వ్యూహాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి. దేశంలో రూమ్ ఎయిర్ కండిషనర్ల మార్కెట్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోంది. పెరుగుతున్న ఆదాయ స్థాయులు, వేగవంతమైన పట్టణీకరణ, అలాగే ఉష్ణోగ్రతల తీవ్రత పెరగడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. వినియోగం తక్కువగా ఉన్న మార్కెట్లలో తొలిసారిగా వినియోగించే వారు అలాగే మరింత మెరుగైన పట్టణ ప్రాంతాల్లో రిప్లేస్‌మెంట్ డిమాండ్‌తో ప్రస్తుతం సుమారు 1.4 కోట్ల యూనిట్లుగా ఉన్న మార్కెట్ పరిమాణం 2030 నాటికి 3 కోట్ల యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా టియర్-3, టియర్-4, టియర్-5 నగరాలు కీలక వృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఈ మార్కెట్లు టియర్-1 మరియు టియర్-2 శ్రేణి నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పోర్ట్‌ఫోలియోలో ఇన్వర్టర్, ఫిక్సిడ్ స్పీడ్, విండో ఏసీలు ఉన్నాయి. వివిధ ధరల శ్రేణుల్లో వినియోగదారులకు అనువైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. విశిష్టమైన వినియోగదారులను ఆకట్టుకునేలా ‘మిడ్‌నైట్ సిల్వర్’ ఫినిష్‌తో ‘ఐకానియా’ (‘Iconia’) అనే ప్రీమియం మోడల్‌ను ఆవిష్కరించడం ఇందులో ప్రధాన ఆకర్షణ. ‘సూపర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీలు’, ‘హెవీ డ్యూటీ ఏసీలు’, ‘హాట్ అండ్ కోల్డ్ ఏసీలు’, ‘యాంటీ వైరస్ టెక్నాలజీ ఏసీ’లను కూడా సంస్థ ఫ్లాగ్‌షిప్ మోడళ్లుగా విడుదల చేసింది. సూపర్ ఎనర్జీ ఎఫీషియెంట్ ఏసీల్లో డైనమిక్ డ్రైవ్ టెక్నాలజీ ఉంది. ఇది విద్యుత్తును ఆదా చేసే విధంగా, అధిక గాలి ప్రవాహంతో సమర్థవంతమైన కూలింగ్ అందిస్తుంది. ఈ టెక్నాలజీతో 1 టన్ను ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ISEER 6.25ని సాధించగలదు. ఇది సాధారణ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీతో పోలిస్తే సుమారు 45% ఎక్కువ ఎనర్జీ సామర్థ్యం కలిగి ఉంటుంది.
తయారీ సామర్థ్యాల విస్తరణ
రూమ్ ఎయిర్ కండీషనర్ల వ్యాపార వృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూస్టార్, వివిధ ప్లాంట్లవ్యాప్తంగా తమ తయారీ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 14 లక్షల యూనిట్లుగా ఉండగా, డిమాండ్‌ని బట్టి 18 లక్షల యూనిట్లకు పెంచుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రూమ్ ఏసీల ఉత్పత్తి కోసం బ్లూస్టార్‌కి హిమాచల్ ప్రదేశ్‌లో రెండు ప్లాంట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో అధునాతన ప్లాంటు ఉంది. సమర్ధతను, నాణ్యతను, విస్తృతిని మెరుగుపర్చుకునే విధంగా వీటిలో అత్యాధునిక అసెంబ్లీ లైన్‌లు, ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌లు సహా ఐవోటీ ఇంటిగ్రేషన్ మరియు డిజిటలైజేషన్ గల అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఈ సందర్భంగా బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ త్యాగరాజన్ మాట్లాడుతై “భారతదేశంలో కూలింగ్ డిమాండ్ కీలక మలుపు దశలో ఉంది. సానుకూల డెమోగ్రాఫిక్స్ మరియు వినియోగ ధోరణుల్లో మార్పులు దీనికి కారణం. భవిష్యత్తులో సుమారు 15 కోట్ల కుటుంబాలు ఏసీలు కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంది అని అన్నారు.