Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్ ముందు ఆశల ధర్నా

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
రాష్ట్ర బడ్జెట్లో ఆశ వర్కర్లకు బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు నాయకులు దాసరి పాండు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా పట్టణాల్లో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న ఆశాలను వేతనం అందజేసి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, అంగన్వాడీ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముక్కెర్ల వెంకటమ్మ, కసగోని లలిత, నాయకులు జ్యోతి సంతోష, సుజాత, జమున, అరుణ, ధనలక్ష్మి, సైదమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.