Take a fresh look at your lifestyle.

ఆలయ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

  • రూ 4.74 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం.
  • డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు.

మధిర, ముద్ర విలేఖరి : శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ముదిగొండ మండల పరిధిలోని యడవల్లి గ్రామంలో శ్రీ యోగా నంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు, వివిధ అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ప్రజలు ఆరాధ్య దైవంగా శ్రీ యోగా నంద లక్ష్మీ నరసింహ స్వామిని కొలుస్తున్నారని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తన ఎన్నికల ప్రచారం ప్రారంభమయిందని, ఆ స్వామి ఆశీస్సులతో నేడు ఆలయ అభివృద్ధికి రూ 4. 74 కోట్లను ప్రభుత్వంచే మంజూరు చేయించడం జరిగిందని అన్నారు.దేవాలయంకు కేటాయించిన అభివృద్ధి నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం కావాలని, ఆలయ పునర్నిర్మాణం పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భగవంతుని ఆశీర్వాదంతో ఋతుపవనాలు ముందస్తుగా వచ్చాయని తెలిపారు. ప్రజల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని అన్నారు ‌.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం సరఫరా, రాజీవ్ యువ వికాసం క్రింద స్వయం ఉపాధి యూనిట్లు, ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళలకు వడ్డి లేని రుణాలు, 22 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, 12 వేల 500 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాలు చేపట్టామని అన్నారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా 12 వేల రూపాయలు పెంచి అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద కూలీలకు 12 వేల రూపాయలు అందిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.