- అరవపల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్లు వర్సెస్ ఎమ్మెల్యే వర్గం మధ్య దాడి ప్రతిదాడి.
- ఘర్షణలో కాలు విరిగిన కార్యకర్త.
- పోలీసుల రంగ ప్రవేశం సద్దుమణిగిన ఘర్షణ.
- సీనియర్లకు నాయకత్వం వహించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధరూర్ యోగానంద చారి.
- తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం అంటున్న ధరూర్ యోగానంద చారి.
- వరస ఘర్షణలతో అట్టుడుకుతున్న నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ.
- కాంగ్రెస్ పార్టీ ముఖ్య పరిశీలకులు డిసిసి అధ్యక్షుడు ముందే బాహబాహి.
ముద్ర,తుంగతుర్తి : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా గత 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేతలు స్థానిక శాసనసభ్యుని పై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. తాజాగా అరవపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాహాబాహీ కి దిగాయి .సీనియర్ల వర్గానికి నాయకత్వం ధరూరు యోగానంద చార్యులు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వహించగా ఎమ్మెల్యే వర్గం వారు సమావేశానికి వచ్చి రాగానే ఇరు వర్గాలు నినాదాలు చేసుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సమావేశంలో ఫ్లెక్సీలో ఫోటోలు చిన్నవిగా వేశారని ఒక వర్గం వారు మరో వర్గం వారితో ఘర్షణ కు దిగినట్లు సమాచారం. సమావేశానికి ముఖ్య అతిథులుగా రావాల్సిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ మరో నాయకుడు శత్రు నాయక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ విషయాన్ని తెలుసుకుని సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది ఒక కార్యకర్తకు కాలు విరగడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపినట్లు సమాచారం. గత నాలుగు ఐదు రోజుల క్రితం తిరుమలగిరిలో ఇదే పరిశీలకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుండగా పరిశీల కుల సమీక్షంలోనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తగా ఆ సమావేశం సైతం రసభాసగా మారింది. సాక్షాత్తు సమావేశ పరిశీలకుల ముందు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ముందే తమ అన్యాయం జరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు .నియోజకవర్గంలో తమకు గుర్తింపు లేదని వారు తీవ్రంగా విమర్శించారు. అది జరిగిన నాలుగైదు రోజులకే తిరిగి అరవ పెళ్లిలో తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెడరేగడం కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న వర్గ విభేదాలకు మరింత ఆద్యం పోసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో గత నాలుగైదు దశాబ్దాలుగా మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఏకచిత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఓడిన మాజీ మంత్రి కనుసన్నలలోనే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగే వి. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు గ్రామాలలో నాడు ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలతో ఘర్షణలు పడి కేసుల పాలైన సంఘటనలు జరిగాయి గత పది సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ప్రస్తుతం రాష్ట్రంలో తుంగతుర్తి లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని భావించిన సీనియర్ కార్యకర్తలకు బి ఆర్ ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే వద్ద చేరిన వారితో ఘర్షణలు ప్రారంభమయ్యాయి .బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న నాడు వారి వల్లనే తాము గ్రామాలలో ఇబ్బందులు పడ్డామని తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లోకి వచ్చి తిరిగి తమకు పోటీదారులుగా మారారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కొనసాగితే తాము గాంధీభవన్ ముట్టడికి సైతం వెనకాడమని సీనియర్లు చెబుతున్నారు. పిసిసి అలాగే ముఖ్యమంత్రి అలాగే ఏఐసీసీల దృష్టికి కూడా సమస్యలు తీసుకువెళ్తామని ధరూర్ యోగానంద చారి అరవ పెళ్లిలో విలేకరుల సమక్షంలో తెలిపారు. ఇంత జరుగుతున్న అధిష్టానం మాత్రం తుంగతుర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న లొల్లిపై దృష్టి సారించినట్లు కనబడడం లేదు .ఏది ఏమైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్లుగా రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ ముందు ముందు ఏ విధమైన తీరులో పయనిస్తుందో వేచి చూడాల్సిందే.
