- ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్.
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పాటు.
- ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న, ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులకు సహాయం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న, ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు,విద్యార్థులకు సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం రాలేదు. అయినప్పటికీ భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి.
- సహాయం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు
వందన,పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ : 91 9871999044
జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ : 9643723157
జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ : 9910014749
సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి : 9949351270