Take a fresh look at your lifestyle.

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, యాదగిరిగుట్ట :
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
బుధవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహణ, అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో మొత్తం ఎంతమంది పిల్లలు నమోదు అయ్యారని , ప్రతి రోజు పిల్లలు ఎంత మంది అంగన్వాడీ కేంద్రానికి వస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పిల్లలకు ప్రతిరోజు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన ఆహారంఅందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు పిల్లలకు వడ్డించిన భోజనాన్ని స్వయంగా పరిశీలించి, ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. ఆహారం తయారీలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.చిన్నారుల పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.రోజువారీగా పిల్లలకు నిర్వహించే విద్యా, వినోద కార్యక్రమాలు ఏమిటి అని అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో స్వయంగా మాట్లాడి, ఏబీసీడీలు చెప్పించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించారు. గర్భిణీలు, బాలింతలకు అందించే సేవలు కూడా సక్రమంగా ఉండాలని, వారికి అవసరమైన పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అంగన్వాడీ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.