ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో ఆదివారం విపంచి ఆడిటోరియంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్రంలో మోదీ మైనారిటీలను పట్టించుకున్న పాపానా పోవడం లేదు అని అన్నారు. రిజర్వేషన్ ను పెంచుతామని చెప్పి 10 సంవత్సరాలు కెసిఆర్ ముస్లిం ప్రజలను మోసం చేశారని అన్నారు. దేశంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన ముస్లిం రిజర్వేషన్ ఇప్పటికీ కొనసాగుతున్నది అని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రం దేశం లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప మిగిలిన ఏ ప్రభుత్వం కూడా మైనారిటీల అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మైనారిటీలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో రాహుల్ గాందీ ప్రధాని కావాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశం లోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అర్హులైన ముస్లింలకు త్వరలోనే స్కూటీలను అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరో 10 సంవత్సరాలు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పయ్యావుల ఎల్లం రియాజుద్దీన్. పూజల గోపి మీసం మహేందర్ షాబుద్దీన్ వహాబ్ గయాజుద్దీన్ రషద్. హర్షద్ విజయ్ డానియల్ అజ్మత్ మున్న సలీం చెంది శ్రీనివాస్ బాబా. స్రవంతి మైపాల్ రెడ్డి చోటాస్మత్ దేశెట్టి నరేష్..మున్నా. తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.