ముద్ర ప్రతినిధి, మెదక్:
భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ, కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం మాట్లాడుతూ… భగత్ సింగ్ బ్రిటీషు పాలనలో స్వరాజ్య స్థాపన కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి 23 సంవత్సరాల వయస్సులోనే ఉరి తీయబడిన మహా నాయకుడని కొనియాడారు. సిపీఎం పార్టీగా జిల్లాలో భగత్ సింగ్ ఆశయ సాధనలో భాగంగా పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించి సమాజ మార్పు కోసం తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జె. సంతోష్ కుమార్, సిహెచ్. అజయ్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.