Take a fresh look at your lifestyle.

ఫస్ట్ ఫెడరేషన్ కప్ వాలి బాల్ పోటీలు ప్రారంభించిన పీయేసీ చైర్మెన్

మాదాపూర్, ముద్ర : ఫస్ట్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్స్ త్రీఏ సైడ్ వాలీబాల్ కప్ 2025 మొట్ట మొదటిసారిగా చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు పీయేసీ ఛైర్మెన్ అరికపూడి గాంధీ.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, డయ్యూ అండ్ దామన్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, హర్యానా, చత్తీస్ ఘర్ రాష్ట్రాలకు చెందిన మహిళల, పురుషుల జట్లు ఈ ఫెడరేషన్ కప్ లో పాల్గొంటుడగా, మూడు రోజుల పాటు జరగనున్న ఈ వాలీబాల్ టోర్నమెంట్ ను త్రీఏ సైడ్ జనరల్ సెక్రటరీ మారుతి హజారీ, ఛైర్మెన్ జీవన్ కిరణ్ జాలాది, ఎల్. రత్నకుమార్, రఘునాథ్ రెడ్డి,హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ నిమ్మల ఫౌండేషన్ చైర్మెన్ నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, రఘునందన్ రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఫస్ట్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్స్ త్రీఏ సైడ్ వాలీబాల్ కప్ 2025 మొదటి సారిగా మన ప్రాంతంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, 11 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతా ఇస్తుందని, క్రీడాకారులకు తగిన సదుపాయాలు ఉన్నాయని, అన్ని క్రీడలకు, క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని PAC చైర్మన్ గాంధీ గారు అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి, పీజేఆర్ లాంటి స్టేడియాలు అందుబాటులో ఉన్నాయని, రానున్న కాలంలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.క్రీడల్లో గెలుపు ఓటములు సర్వ సాధరణమని, ఓటమి గెలిపుకు నాంది అన్నది మర్చిపోవద్దని, గెలిచేందుకు ప్రయత్నించాలని చైర్మన్ గాంధీ క్రీడాకారులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, రవీందర్ రెడ్డి, సత్య రెడ్డి, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా, ఎల్లమయ్య, రాహుల్ మరియు ఆయా రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.