ముద్ర ప్రతినిధి ,హనుమకొండ: హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా న్యాయవాది పులి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కొత్త రవి లు ఎన్నికయ్యారు. శుక్రవారం హోరా హోరీగా జరిగిన బార్ ఎన్నికల్లో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు రాగా 26 ఓట్ల మెజారిటీతో పులి సత్యనారాయణ అధ్యక్షులుగా గెలుపొందారు.ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసిన కొత్త రవి సమీప అభ్యర్థి ఊరుగొండ నరేందర్ పై 109 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ 245 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మహిళా జాయింట్ సెక్రటరీగా నాగేంద్ర, జాయింట్ సెక్రటరీగా అంబేద్కర్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా సి మల్లేశ్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, కోశాధికారిగా చింత సాంబశివరావు, ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నాలుగు అభ్యర్థిత్వాలకు ఆరుగురు పోటీ పడగా శివకుమార్ యాదవ్, కమలాకర్, సునీల్, చింత నిఖిల్ లు ఎన్నికయ్యారు.30 సంవత్సరాల కార్యనిర్వాహక సభ్యులుగా కామేశ్వరపు రాజేశ్వర్ రావు, 20 సంవత్సరాల కార్యనిర్వాహక సభ్యులుగా కె ఆశీర్వాదం, 10 సంవత్సరాల మహిళా కార్యనిర్వాహక సభ్యులుగా ఇందిరా వేదవతి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి కొండబత్తుల రమేష్ బాబు, రవీందర్ రావు, రాజారామ్ రెడ్డి, ఎన్నికల ఫలితాలను ప్రకటించి పాత కమిటీ నుండి కొత్త కమిటీకి బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఎన్నిక కోసం కృషి చేసిన న్యాయవాదులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తాననని అన్నారు.
