Take a fresh look at your lifestyle.

15న రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం

రామకృష్ణాపూర్, ముద్ర : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఈ నెల 15 వ తేదీన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆర్ఓబి ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను,సభ స్థలాన్ని శనివారం నాయకులు పరిశీలించారు. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై రాజశేఖర్,పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి కార్యదర్శి రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్,పనస రాజు,కట్ల రమేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.