ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వ సంపదను కాపాడుకోవాలని సిఎస్ఐ పాఠశాల ఆడిటోరియంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ…పూర్వీకులు నిర్మించిన దేవాలయాలు, కోటలు,మసీదులు, పురాతన కట్టడాలు, జానపద కళలు, భాషలు, సాహిత్యం, సంప్రదాయ పండుగలు మన చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు.
వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
మునిపల్ ఛైర్పర్సన్ కనుగుల రాధిక భూపతి రాజ్ మాట్లాడుతూ..యువత తమ సంస్కృతి, చరిత్ర పట్ల అవగాహన పెంచుకొని వాటి పరిరక్షణలో ముందుండాలని సూచించారు.
జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మాట్లాడుతూ…పురాతన దేవాలయాలు, శిల్పాలు, చారిత్రక కట్టడాలను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్ర రాజు, కవులు, రచయితలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.