Take a fresh look at your lifestyle.

ఎక్కువ తూకం వేస్తే చర్యలు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం బస్తా 41 కిలోలకంటే ఒక్క గింజ ఎక్కువ తూకం వేసినా చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.
అన్నీ కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా
జరగాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. మంగళవారం రేగోడు మండలంలో ఏర్పాటు చేసిన పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అసస్మికంగా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, లోడింగ్, ట్యాబ్ ఎంట్రీని పరిశీలించారు.
సివిల్ సప్లై, రవాణా, డిఆర్డీఓ, సహకార తదితర శాఖల అధికారులు అలాగే కేంద్ర నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేసి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా బాధ్యత వహించాలని ఆదేశించారు.
1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం
జిల్లాలో ఇప్పటి వరకు 1,85,688 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37,072 రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 26,191 మంది రైతులకు 260.03 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత స్పీడ్ అప్ చేసి, అకాల వర్షాల నుండి కాపాడడానికి టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, మిల్లర్లు అన్లోడింగ్ ప్రక్రియను సైతం త్వరిత గతిన చేపట్టాలన్నారు.
ఇండ్ల గణన పారదర్శకంగా జరగాలి
జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.
రేగోడ్ మండలకేంద్రంలోని కొత్వాన్ పల్లిలో జరుగుతున్న ఇండ్ల గణన ప్రక్రియని పరిశీలించారు.
ఇంటింటి సర్వే సక్రమంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం ఎన్యుమరేటర్ల ప్రధాన బాధ్యత అని తెలిపారు.
నిర్దేశిత నిబంధనల ప్రకారం.. మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన, కచ్చితమైన వివరాలను సేకరించాలాన్నారు

Leave A Reply

Your email address will not be published.