Take a fresh look at your lifestyle.

పెన్షన్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయండి – కలెక్టర్ కు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నేత, రాఘవాపురం పంచాయతీ సభ్యుడు నగేష్ నివేదన

 

ముద్ర ప్రతినిధి, బీబీనగర్:

బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన, పెండింగ్లో ఉన్న అన్ని రకాల పింఛన్లను త్వరిత గతిన మంజూరు చేయాలని రాఘవాపురం పంచాయతీ వార్డ్ సభ్యుడు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా నేత జక్కి నగేష్ కలెక్టర్ ను కోరారు. ఆసరా పెన్షన్లు
వితంతువులు, దివ్యాంగులు, బీడి కార్మికులు, నేతన్నలు, కల్లు గీత కార్మికులు, హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ రోగులు, ఫైలేరియా రోగులు, ఒంటరి మహిళలు, డయాలిసిస్ రోగులు, వృద్ధులు, వితంతువులు పలువురు ప్రభుత్వ పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం భువనగిరిలో కలెక్టర్ అనురాగ్ జయంత్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు కోసం బీబీనగర్ మండలం, రాఘవాపురం గ్రామానికి చెందిన సుమారు 60 మంది నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉన్నారని అన్నారు కాని నెలలు గడుస్తున్నప్పటికీ వారిక పెన్షన్ రాకపోవడంతో వారు, పెన్షన్ రాకపోవడానికి గల కారణాలు తెలుసుజూదానికి మీసేవా కేంద్రాలకు వెళితే సైట్ ఓపన్ కావడం లేదని చెబుతున్నారని నగేష్ పేర్కొన్నారు. అర్హత కలిగినప్పటికి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ మంజూరులో ఆలస్యం అగుచున్నదా లేదా ఇంకా ఏమైనా కారణం వుందా అన్నది తెలియడం అని అన్నారు. అలాగే ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్స్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను పరిశీలించి, అర్హత కలిగిన వారికి పెన్షన్ మంజూరు చేయించి, లబ్దిదారులను ఆదుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో రాఘవపురం గ్రామపంచాయతీ వార్డు సభ్యులు. దొంతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. బండారి అశ్విని రాఘవేందర్ గౌడ్.బుయ్య పాండు. గుంటిమిది విజయ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.