Take a fresh look at your lifestyle.

పర్వతారోహకులకు ల్యాంకోలో ఘనంగా సన్మానం

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: ల్యాంకో హిల్స్ నుండి వెళ్లి హిమాలయ పర్వత బేస్ క్యాంప్ (5,500 మీటర్ల ఎత్తు) వరకూ పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసుకు వచ్చిన బృందాన్ని ల్యాంకో హిల్స్ క్లబ్ హౌజ్ లో ల్యాంకో లయన్స్ సభ్యులు ఘనంగా సన్మానించారు.ల్యాంకో లయన్స్ సభ్యులు,ల్యాంకో హిల్స్ లో నివాసముంటున్న పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని అధిరోహకులను అభినందించారు.పర్వతారోహకులలో 11మంది మహిళలు ముగ్గురు పురుషులు ఉన్నారు.వారిలో ముందుగా శ్రీమతి అనితారెడ్డి మాట్లాడుతూ “మైనస్15° ల చలిలో పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము.మోకాళ్ల నొప్పులు, ఆయాసం వస్తున్నా ధైర్యంతో,పట్టుదలతో,సానుకూల దృక్పథంతో ముందుకు సాగి విజయం సాధించాము.రోజుకు రెండుసార్లు అతి తక్కువ మోతాదులో ఆహారం తీసుకునే వాళ్ళం.ఆహారంలో ఆలూ మరియు పప్పు ఉండేవి. ఒక వాటర్ బాటిల్ రూ 500/- పెట్టి కొనేవాళ్ళం” అని వివరించారు. మరొక సభ్యుడు చుంచు శ్రీనివాస్ మాట్లాడుతూ “పర్వతారోహణలో కొత్తగా అనేక విషయాలను నేర్చుకున్నాను, హైదరాబాద్ లో మనం ఆధునిక సౌకర్యాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాం. కానీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణలో అతి తక్కువ సౌకర్యాలతో ఎలా జీవించాలో నేర్చుకున్నాను” అన్నారు.

బృందంలోని మిగతా సభ్యులు శ్రీమతి రోహిణి,శ్రీమతి అరుణ, శ్రీమతి జ్యోతి, మధువన్ వారి అనుభవాలను పంచుకున్నారు.
ల్యాంకో లయన్స్ ఫౌండర్ మెంబర్,బీసీనియర్ రెసిడెంట్ ఎన్ జనార్ధన్ రెడ్డి ట్రెక్కింగ్ బృందాన్ని అభినందిస్తూ “మీరంతా ఒక దృఢమైన సంకల్పంతో, శారీరకంగా, మానసికంగా పూర్తిగా మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుని, ఏ విధమైన భయాలను,సంకోచాలను మనసులోకి రానివ్వకుండా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గమ్యాన్ని సురక్షితంగా చేరి,ఆరోగ్యంగా తిరిగి వచ్చారు.;మీ లాంటి బృందం మన కమ్యూనిటీలో ఉండటం మా అందరికీ గర్వకారణం.ఇది భావితరాలకు స్ఫూర్తిదాయకం” అని ప్రశంసించారు దీనిని స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని,వారు శారీరకంగా,మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని,దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది, జీవితంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగి,వారు ఎంచుకున్న రంగంలో విజయం సాధించగలరని అన్నారు.సన్మాన కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లను బద్రికిషోర్ చేయగా, గాంధీ, శ్రీనివాస్ సింగ్, చలపతి గారు పర్యవేక్షించారు.శ్రీచరణ్ ఆద్యంతం కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు.

 

Leave A Reply

Your email address will not be published.