Take a fresh look at your lifestyle.

పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవే లక్ష్యం- మాజీ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి

 

ముద్ర : మల్కాజిగిరి

పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని నేరేడ్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు.
ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్‌గా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సైనిక్ పూరి డిఫెన్స్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. జిహెచ్ఎంసి నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో రూ.168 కోట్ల నిధులతో గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసినట్లు వెల్లడించారు.
డివిజన్ పరిధిలోని యాప్రాల్, నేరేడ్మెట్, మధురానగర్ సహా మొత్తం 95 కాలనీలలో నిత్యం పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసినట్లు చెప్పారు. రోడ్లు, బాక్స్ డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి వంటి కనీస వసతుల కల్పనకు జిహెచ్ఎంసి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో నిస్వార్థంగా పనిచేశామని వివరించారు.
భవిష్యత్తులో కూడా రాజకీయాలలో కొనసాగుతూ రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో తిరిగి పోటీ చేయనున్నట్లు మీనా ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ప్రజల ఆశీస్సులతో గెలుపొందుతూ మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నేత ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ ఈటెల రాజేంద్ర సహకారంతో నేరేడ్మెట్ డివిజన్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఎక్కడ సమస్యలు ఉన్నా అక్కడికి చేరుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేశామని చెప్పారు. భవిష్యత్తులో కూడా నేరేడ్మెట్ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.