- ఏలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు
- ఎమ్మెల్యే వంశీకృష్ణ.
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కట్టి ఇవ్వాలని అన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని వంశీకృష్ణ అన్నారు.నిరుపేదల కు ఇండ్లు ఇవ్వాలనే భాగంగానే ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో అర్హులైన లబ్బిదారులను ఎంపిక చేయడం జరిగింది త్వరలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు, ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నారు.అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అచ్చంపేట నియోజకవర్గనికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్రమంత్రి జూపల్లి కృష్ణారావు గౌరవ ఎంపి డాక్టర్ మల్లురవి కి అచ్చంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని వంశీకృష్ణ అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సొంతింటి కల నెరవేర్చడానికి ఈ యొక్క ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనీ. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులను గుర్తించాము మరికొన్ని చోట్ల గృహ నిర్మాణం కూడా జరుగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎంపికలో ఎటువంటి అవినీతి అక్రమాలకు పైరవీలకు తావు లేకుండా ఎంపిక చేయడం నిర్మించడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని పిలుపునిస్తున్నాం అని వంశీకృష్ణ అన్నారు.