Take a fresh look at your lifestyle.

ఇంటర్ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సాగాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

 

ముద్ర, మహాదేవపూర్: విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరై తమ ప్రతిభను చాటాలని సూచించారు. పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఒక ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమయపాలనతో పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. 25వ తేది బుధవారం నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. హాల్ టికెట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
జిల్లా యంత్రాంగం తరఫున పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి వత్తిడికి గురికావొద్దని, తల్లిదండ్రులు విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించి, ఒత్తిడి లేకుండా పరీక్షలకు పంపాలని సూచించారు.
విద్యార్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఏదేని సలహాలు, సందేహాలకు అలాగే పరీక్షా కేంద్రాల సమాచారం కొరకు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కంట్రోలు రూము నంబర్లు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 9705299368, మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసే 8008878060 నంబరుకు కాల్ చేయాలని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.