- ఏం సి చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్.
ధర్మపురి, ముద్ర : ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్విని చేసుకోవాలని ధర్మపురి ఏఎంసీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్ అన్నారు.శుక్రవారం ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్, దొంతపూర్, మగ్గిడి, ఆరెపల్లి, గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను తిమ్మాపూర్, జైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించి మాట్లాడారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిధాన్యం విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ రంగ సంస్థలకే తమ వరి ధాన్యం విక్రయించి ప్రభుత్వం మద్దతు ధరను పొందాలన్నారు.వరి ధాన్యం విక్రయానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు.సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేనానికి అధిక ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతుందన్నారు.వరి ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కు ఈ సందర్భంగా రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్, జైన ఫ్యాక్స్ చైర్మన్లు సాయిని సత్తన్న, సౌళ్ళ నరేష్, సీఈఓ సాగర్ రావు, నాయకులు లింగాల హరీష్, కుంభాల మల్లేష్, జిల్లపల్లి రవి, ఎన్కూష్ రాజేందర్, సరదా సాయికుమార్, దాసరి రాజన్న, తిరుపతి గౌడ్ తదితర నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.