Take a fresh look at your lifestyle.

మహిళా బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ

 

ముద్ర, తుంగతుర్తి..

భారతీయ జనతా పార్టీ కి మహిళా బిల్లు పట్ల చిత్తశుద్ది లేదని సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ కిషన్ రావు అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలను అత్యున్నత పదవి లో నియమించింది అలాంటి కాంగ్రెస్ పార్టీ మీద అబాండాలు వేయడం మానుకోవాలి అని హితావు పలికారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో 2023 లోనే ఏకగ్రీవంగా ఆమోధించింది. ఇప్పుడు లోక్ సభలో విఫలమైంది ఏమిటంటే మహిళా బిల్లు ముసుగులో దేశ వ్యాప్తంగా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల స్థానాల సంఖ్య ను పెంచడానికి, నియోజకవర్గాల పునర్వీభజన చేపట్టడానికి చేసిన ప్రయత్నమే అయినటువంటి 131 రాజ్యాంగ సవరణ బిల్లు అని మహిళా రిజర్వేషన్ బిల్లును కొత్తగా తీసుకురావలసిన అవసరం లేదన్నారు. డీలిమిటేషన్ పేరుతో మళ్ళీ అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ కుటిల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మహిళా బిల్లు ను అమలు చేయకుండా భారతీయ జనతా పార్టీ యే అడ్డుపడుతుందని మహిళా లోకం గమనించి బిజెపి కి తగిన బుద్ది చెప్పాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.