- రాష్ట్రాన్ని స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా అభివృద్ధి చేస్తాం.
- ఓయూ పీజీ లా కాలేజీలలో మెగా జాబ్, స్కిల్, లోన్ మేళాలో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : యువత తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ లోని ఉస్మానియా పీజీ లా కాలేజీ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రి జయంతి చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్” గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర సహకారం కావాలని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరిని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే యువత శిక్షణకు కొత్త కోర్సులు రూపొందిస్తున్నామని తెలిపారు.యువత వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు.ఈ సందర్భంగా కేంద్రం నుండి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జయంతి చౌదరి హామీని ఇచ్చారు.యువత లో నైపుణ్యం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, హీరావతి అనిల్ కుమార్, గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ పాల్గొన్నారు.