Take a fresh look at your lifestyle.

దావరి జిల్లా రాక ఎండిపోయిన పొలాలను కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ ప్రభుత్వం

  • ప్రభుత్వ వైఖరికి నిరసనగా కళ్లకు గంతలతో రైతులతో కలిసి ఎండిన పొలాల్లో పర్యటించిన బిఆర్ఎస్ నాయకులు.
  • ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

తుంగతుర్తి, ముద్ర: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు తో పొలాలన్ని ఎండి పోయి రైతులు అప్పుల పాలయ్యారని గుడితండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎండిన పొలాల్లో కండ్లకు గంతలు కట్టుకొని బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి శుక్రవారం నిరసన తెలియ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ సీనియర్ బిఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్ లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం కోసం ఎన్నికల ముందు రైతులకు,మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో నెర వేర్చ లేదని అన్నారు.. ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా పాలన చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ పాలన అంటే రైతుల పంట పొలాలు ఎండబెట్టడమే నా అని ఏద్దేవా చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టిపల్లి వెంకట్ స్థానిక సర్పంచ్ భారతి పుణ్యానాయక్, గ్రామాశాఖ అధ్యక్షులు గుగులోతు రవి నాయక్.. మరియు మహిళలు. రైతులు. పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.