- చరిత్రలో పేదల గుండెల్లో నిలిచపోనున్న సిఎం రేవంత్ రెడ్డి.
- మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, మాజీ ఎంపిపి నర్సింహ రెడ్డి.
అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ప్రజా పాలన ప్రభుత్వంలో సిఎం రేవంత్ రెడ్డి పేదింటి నిరుపేదలకు ఆసరాగా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం తమ చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి మరియు మాజీ ఎంపిపి అరుణా నర్సింహ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో రేషన్ షాపుల 06, 07 లలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా కట్ట అనంతరెడ్డిమాట్లాడుతూ రేషన్ షాపు ల ద్వారా బియ్యం తీసుకునే ప్రతి పేదకుటుంబం సన్నబియ్యం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.ప్రజా పాలనలో అన్ని వర్గాల పేదలకు ఆదుకోవడంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటూ ముందుకు పోతున్నారని అనంత రెడ్డి అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులతో పాటు దాదాపు 10లక్షల నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసి పేదలకు సన్నబియ్యం అందించిన ఘన చరిత్ర ప్రజా ప్రభుత్వానికి సిఎం రేవంత్ రెడ్డి కి మరియు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలియజేశారు.త్వరలో రేషన్ బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను కూడా అందజేయడం కోసం ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు.గతంలో పదేళ్లు పరిపాలించిన బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా పేదలకు ఇవ్వలేదని పైగా దొడ్డు బియ్యం ద్వారా పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని అది గమనించిన సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం పథకాన్ని ప్రారంభించి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం ఎంతో గొప్ప ఆలోచన అని అన్నారు.అలాగే బీసీలకు42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో మండల తహశీల్దార్ ప్రమీల, మాజీ ఎంపీటీసీ రంగారెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ గంట కురమయ్య యాదవ్, డైరెక్టర్ రంగారెడ్డి, డీలర్ బూషిరాజ్ మల్లయ్య, మరియు నాయకులు పద్మనాభరెడ్డి, జంగిరెడ్డి, కళావతమ్మ, మాజీ సర్పంచ్ లు వేణుగోపాల్ రెడ్డి, గుండెమోని లింగమయ్య యాదవ్, బాలస్వామి, జంగరావు, నాగార్జున, బాల్ రెడ్డి, గుద్దటి బాలరాజు, సైదులు, రమేష్, లింగమయ్యా గౌడ్, బాలరాజు, కాటమయ్య, రాజమౌళి, కృష్ణారెడ్డి, రాజు, స్వామి, జైపాల్ రెడ్డి, లింగమ్మ, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
