Take a fresh look at your lifestyle.

అంబేద్కర్ జయంతికి రామ్ రహీం ఆటో యూనియన్ కు ఆహ్వానం

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని ఆటో కార్మికులకు అంబేద్కర్ తాలూకా కమిటీ ఆహ్వానం అందజేశారు. అచ్చంపేట పట్టణంలో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ దయవలన ఇవ్వాళ భారతదేశం నడుస్తుందనీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించకుంటే ప్రజాస్వామ్యం లేదని చరిత్ర కూడా లేకుండా ఉంటుండే అని బాబాసాహెబ్ అంబేద్కర్ దయవలన ఈ దేశం నడుస్తుంది అందుకనే ఈనెల 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నాము అని అన్నారు. రామ్ రహీం ఆటో యూనియన్ ద్వారా హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా అనేక రకాల కార్యక్రమాలు మా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో జరిగాయని అంబేద్కర్ జయంతిని కూడా జయప్రదం చేయాలని మహబూబ్ అలీ అచ్చంపేట ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు అధ్యక్షులు ఆనందు కుమార్, పాతుకుల శ్రీశైలం, విజయ్, ప్రభాకర్, యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ అశు, ఉస్మాన్ ,ముస్తాక్, కాజ మియా, చందు, అక్బర్ దుర్గేష్, కాజ, అజ్జు,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.