Take a fresh look at your lifestyle.

గ్యాస్, పెట్రోల్ కొరత లేదు- జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి, మెదక్:
గ్యాస్ ఇంధనం సరఫరాపై వదంతులు నమ్మొద్దని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ సూచించారు.
మెదక్ జిల్లాలో ఎటువంటి గ్యాస్, ఇంధనం కొరత లేదని స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ఇంధనం సరఫరా విషయంలో ఎక్కడా కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుందని, వదంతులు నమ్మవద్దని తెలిపారు.
పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్ తీవ్రంగా ఖండించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రోజుకు సగటున 2300 సిలిండర్లు బుక్ అవుతుండగా, వాటికి 100 శాతం డెలివరీ జరుగుతోందన్నారు. అదనంగా జిల్లాలోనీ గ్యాస్ గోదాముల్లో సుమారు 4300 సిలిండర్లు నిల్వ ఉండగా, మరో 5000 సిలిండర్లు ట్రాన్సిట్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 87 పెట్రోల్ బంకులు, 16 గ్యాస్ ఏజెన్సీలు సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలను అరికట్టేందుకు సివిల్ సప్లైస్, రెవెన్యూ, లీగల్ మెట్రాలజీ మరియు పోలీస్ శాఖల సంయుక్త బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్, పౌర సరఫరాల శాఖ, పోలీస్, రెవిన్యూ ఆధ్వర్యంలో బృందాలు మెదక్ పట్టణంలో పలు హోటళ్లు రెస్టారెంట్లలో విస్తృత తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లను సీజ్ చేసి 83 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం లేదా చమురు కంపెనీల అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించారు. గ్యాస్ ఇంధనం కొరత లేదు కాబట్టి ప్రజలందరూ సంయమనం పాటించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.