Take a fresh look at your lifestyle.

దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి-సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు.

 
-నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
 
ముద్ర, మోత్కూర్:
రైతులు పండించిన వరి ధన్యాన్ని కొనుగోలు చేసేందుకు సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మోత్కూర్ లో విలేకరులతో మాట్లాడుతూ రైతులు అరుకాలం కష్టపడి పండించిన వరి పంట చేతికివచ్చి వరికోతలు ప్రారంభమైనప్పటికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాలయాపన చేస్తుండటంతో ప్రైవేటు వ్యాపారులు వే బ్రిడ్జి లను ఏర్పాటు చేసుకొని కారుచౌకగా దాన్యాన్ని కొనుగోలు చేసెందుకు సిద్ధంగా ఉన్నారని రైతులు వారి చేతిలో దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మద్దతు ధరకు దాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపినీలు, డీలర్లపై పీడీయాక్ట్ నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.