ముద్ర, మహాదేవపూర్:
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని తెలిపారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత మరియు నైతిక విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని అన్నారు. ఈతరం యువత ఆయన సేవాభావం, నాయకత్వ లక్షణాలు మరియు ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ప్రధానమని ఆయన తెలిపారు.మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడా కార్యాలయంలోని, ఎంపీపీ కార్యాలయంలోని శ్రీపాద విగ్రహానికి నివాళులు అర్పించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఫోటో రాజబాబు, మహాదేవపురం సర్పంచ్ హసీనాభాను అక్బర్ ఖాన్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు కటకం అశోక్, పార్లమెంట్ నియోజకవర్గం విలాస్ రావు, మాజీ ఎంపీపీ రాణి భాయి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మతిన్ ఖాన్, చిటికెసి చక్రధర్, దాహగం సంతోష్, ఖురేషి, నైయో తదితరులు పాల్గొన్నారు