గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడతాం
ముద్ర నడిగూడెం… గ్రామంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడతామని సర్పంచ్ దున్న శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని చెలక బజార్ బిసి కాలనీలో తాగునీటి సమస్య ఉందని మహిళలు తెలపడంతో వెంటనే స్పందించిన సర్పంచ్, పాలకవర్గ సభ్యులు బుధవారం పబ్లిక్ ట్యాప్ ను ఏర్పాటు చేసి అక్కడున్న ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేశారు. మంచి నీటిని వృధాగా పోనివ్వకుండా హౌస్ నిండిన వెంటనే మూతలు పెట్టాలని ప్రజలను కోరారు. పాలకవర్గ సభ్యులు గ్రామస్తుల సహకారంతో ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.ఇంటి ముందు ఉన్న మురికి కాలువలోకి,బహిరంగ ప్రదేశాలలో రోడ్ల పైన చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్ధాలు, వెయ్యరాదని కోరారు.మన గ్రామం మన పరిశుభ్రత మన అభివృద్ధి మనందరి బాధ్యత అనే నినాదంతో గ్రామంలో పారిశుద్ధం, అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు సహకరించాలని తెలిపారు.గ్రామ అభివృద్ధిలో దాతల సహకారం కావాలని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలుగురి నాగరాజు వార్డ్ సభ్యులు దున్న శ్రీకాంత్ కాసాని మాదవి గోపినాథ్ గ్రామస్తులు కాసాని వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.