ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపాలిటీ వార్డు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది కి ర్యాండమైజేషన్ ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సాధారణ పరిశీలకులు గౌతమి, సమక్షంలో నిర్వహించారు.
బుధవారం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్, సాధారణ పరిశీలకులు నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూర్ మున్సిపాలిటీ లలో వార్డుల ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు,అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు , ఇతర పోలింగ్ అధికారులు ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలోని 104 వార్డు స్థానాలకు, ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 257, అసిస్టెంట్.పీ.ఓలు 257,ఇతర పోలింగ్ అధికారులు 514 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు.
ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.