Take a fresh look at your lifestyle.

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం.. పేద మైనార్టీలకు అండగా ప్రభుత్వం.. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మంత్రి అడ్లూరి..

 

ధర్మపురి:

రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడానికి సెక్యులర్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలంతా అండగా నిలవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. రంజాన్ సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. పేద మైనార్టీలకు ప్రభుత్వం ద్వారా అందించే రుణాలు ఇప్పించడానికి తనవంతుగా సహకరిస్తానని మంత్రి తెలిపారు. ముస్లిం యువతకు ఉపాధి కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

పేద ముస్లింలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు అర్హులకు రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మసీదులు ఈద్గాల వద్ద మౌలిక వసతుల కల్పనకు సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. మంత్రి వెంట ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.