- రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
- అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి.
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక శ్యాంసుందర్ పంక్షన్ హల్ గురువారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొని మండలానికి మంజూరు అయిన 1658 కొత్త తెల్ల రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం 67 లక్షల రూపాయల విలువ గల 67 కళ్యాణ లక్ష్మీ చెక్కులను,18 లక్షల 41వేల రూపాయల 65 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తున్నదని,సన్న బియ్యం,రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు మహాలక్ష్మి పథకం అందించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి,మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ప్రభుత్వ దృడ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు,అభివృధ్ధి పనులు చేపడుతున్నదని, రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని,రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని,10 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల నెరవేరిందని,రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,రేషన్ కార్డులు రానివారు మీసేవా కేంద్రంలో కానీ.ప్రజాపాలనలో మరో సారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.ప్రస్తుతం కొత్త కార్డు రాని వారు ఇబ్బందులు పడాల్సిన పని లేదని,రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని,అర్హత ఉంటే కార్డును వెంటనే మంజూరు చేస్తారనీ,కుటుంబ సభ్యుల పేర్లు జోడింపు ప్రక్రియ కూడా వేగంవంతం చేయడం జరిగిందని,అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూధన్, డి ఎస్ ఓ జితేందర్ రెడ్డి,తహశీల్దార్ వరందన్, ఎపిడివో సామా రాంరెడ్డి, ఏపీవో సురేష్ రెడ్డి,విద్యుత్ శాఖ ఏ డి ఈ వరుణ్ కుమార్,ఏఎంసీ చైర్మన్ బీమా సంతోష్ ,వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఆర్ ఐ జీవన్, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
