8500 రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు,
తొమ్మిది మోటార్ సైకిల్ ల స్వాధీనం
ముద్ర, కోరుట్ల;
కోరుట్లలోని జమ్మి గద్దె సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అట్టి స్థావరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8500/- రూపాయల నగదు మరియు ఏడు సెల్ ఫోన్లు మరియు తొమ్మిది మోటార్ సైకిల్ లను స్వాధీనపరుచుకొగా, మరొక ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పేకాట ఆడుతున్న పదిమంది పైన కేసు నమోదు చేశామని కోరుట్ల ఎస్సై ఏం. చిరంజీవి తెలిపారు. కోరుట్ల పిఎస్ సిబ్బంది శివాజీ, ఎల్లయ్య, గంగాధర్, రామకోటి పాల్గొన్నారు.