- అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
- జిల్లా కలెక్టరెట్ కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.
వికారాబాద్, ముద్ర ప్రతినిధి:రెండు రోజులుగా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.బుధ వారం ఉదయం వరకు జిల్లాలో సగటున 30 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత ను నిర్దారించడానికి జిల్లా కలెక్టరెట్ కార్యాలయం లో వర్షా పాతం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.వర్షం కారణంగా ఆస్తి నష్టం, రోడ్లు ముసుకు పోవడం, ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరుగకుండా ఏవైనా పరిస్థితు లను ఎదుర్కొంటున్న యువత సహాయం కోసం వెంటనే కంట్రోల్ రూమును సంప్రదించాలని అయన కోరారు.కంట్రోల్ రూమ్ ను సంప్రదించు నెంబర్లు 08416-242136, 7995061192 తెలిపిన నెంబర్ లకు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.జిల్లా యంత్రాంగం పరిస్థితి ని చురుకుగా పర్యవేక్షస్తుందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని,రెండు మూడు రోజుల్లో వర్షాల ప్రభావం వల్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని, ప్రభుత్వం జారీ చేసిన భద్రత మార్గ దర్శకాలను పాటించాలని కలెక్టర్ సూచించారు.