Take a fresh look at your lifestyle.

బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం అందరికీ శుభాలను తీసుకురావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఉగాది వేడుకలను జరుపుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.