Take a fresh look at your lifestyle.

అబ్దుల్లాపూర్ మెట్ లో పర్యటించిన ఫ్లాగ్ షిప్ కమిషనర్

  • ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నిర్మాణం కోసం స్థల పరిశీలన
  • పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పసుమాములల, మాజీపూర్ డిజిట్ చేసిన శశాంక

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి : అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఫ్లాగ్ షీప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం పర్యటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసింది. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో పసుమాముల లో ఉన్న ప్రభుత్వ స్థలం సర్వేనెంబర్ 422, 51 ఎకరాలు ఉంటుంది. అదేవిధంగా మజీద్ పూర్ గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 224 దాదాపుగా 40 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంటుంది. ఈ స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నిర్మించబోయే స్థలాలను పరిశీలించారు. వీరి వెంట ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, ఆర్ ఐ లు ఇంద్రాణి, నిజాముద్దీన్ మరియు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.