ముద్ర,తాండూరు:
వికారాబాద్ జిల్లా తాండూరు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పట్లోళ్ల నర్సింలు మరియు ఇతర కీలక నేతలు పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
కేసు నమోదుపై అనుమానాలు:
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 15న జరిగినట్లు చెబుతున్న డ్రగ్స్ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఘటన 15వ తేదీన జరిగితే, దానికి సంబంధించి 14వ తేదీనే ఎఫ్‌ఐఆర్ (FIR) ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతోనే డ్రగ్స్ మరియు తుపాకుల కాల్పుల సెక్షన్లను మార్చి రోహిత్ రెడ్డిని ఈ కేసులో ఇరికించారని వారు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు, సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, సలీం బాయ్, పార్టీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.