Take a fresh look at your lifestyle.

4వ వార్డ్‌లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం… కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల 4వ వార్డ్ పరిధిలో ఉన్న ప్రజలకు విద్యుత్ ఒత్తిడి తగ్గి, మెరుగైన సరఫరా అందుతుందని పేర్కొన్నారు. ఈ చర్యపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్ వసంత సంతోష్ గౌడ్, కూచుకుళ్ల నరసింహ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.