ముద్ర, బోడుప్పల్:
బోడుప్పల్ సర్కిల్ పరిధిలో చెరువులలో, నీటి మడుగుల్లో పెరిగిన గుఱ్ఱపు డెక్క (హైసింత్) మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని బుధవారం యంత్రాల సహాయంతో చేపట్టారు. ఈ కార్యక్రమం “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మునిసిపల్ అధికారులు నిర్వహించారు. ఈ పనులను డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎ. శైలజ పీర్జాది గూడ చెరువులో ప్రారంభించి అనంతరం దోమల లార్వా నిర్ములనకు గంబూసియా చేపలను నీటిలో విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎస్‌డబ్ల్యూఎం) కె. జహ్నవి శశాంక పాల్గొన్నారు. ఈ చర్యల ద్వారా నీటి వనరుల శుభ్రతను మెరుగుపరచడం, దోమల పెరుగుదలను నియంత్రించడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా చేపట్టామని డిప్యూటీ కమిషనర్ శైలజ తెలిపారు.