Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారి పరీక్ష

  • జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
  • 149 మంది గాను 142 మంది అభ్యర్థులకు హాజరు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గ్రామ పాలన అధికారి రాత పరీక్ష 2025 ఆదివారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాలలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రంలో 149 అభ్యర్థులకు గాను 142 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. 7 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. గ్రామ పాలన ఆఫీసర్స్ పరీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు రెవెన్యూ శాఖలో పనిచేసిన వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామ పాలన ఆఫీసర్స్ ఈ పరీక్షను రాశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.