ముద్ర. పరకాల.
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసాని దయాకర్ గెలుపు ఖాయమని ప్రచారంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం 9వ వార్డులోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నేతలు ప్రచారం అనంతరం కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. అనంతరం దాసరి దయాకర్ మాట్లాడుతూ తనను 9వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించినట్లయితే వార్డును పట్టణంలో ప్రథమ స్థానంలో నిలుపుతారని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే సహకారంతోపాటు మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున నిధులను తీసుకువస్తానన్నారు. మౌలిక సమస్యలైన మంచినీరు పారిశుధ్యం సిసి రోడ్ల నిర్మాణం లాంటి సమస్యలు పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు.

అర్హులైన అందరికీ పెన్షన్ అందే విధంగా అధికారులతోనూ ఎమ్మెల్యే తో మాట్లాడి వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్ళు ఎదుర్కొనే రోజువారీగా ఎదురయ్యే ఇబ్బందులను కష్టాలను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు. వార్డులు ప్రచారం సందర్భంగా ప్రజలు చూస్తున్న ఆధార అభిమానులతో తన గెలుపు ఎప్పుడూ ఖాయమైందని దయాకర్ తెలిపారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను కోరారు. ప్రచార కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకుడు దార్నా వేణుగోపాల్ దాసరి బిక్షపతి తో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు స్థానిక వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.