మాజీ స్పీకర్ శ్రీపాద రావు వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు.. సుడా చైర్మన్ ఆధ్వర్యంలో అన్నదానం
ముద్ర, కరీంనగర్
విలువల రాజకీయాలకు నిదర్శనం శ్రీపాద రావు
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన శ్రీపాదరావు
శ్రీపాద రావు గారు చూపిన బాటలో నడుస్తాం.. ఆయన కన్న కలలను సాకారం చేయడమే మా లక్ష్యం.- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు – మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాద రావు గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద శ్రీపాదరావు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.*

మొదట డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై మాజీ ఎమ్మెల్యేలు కటకం మృత్యుంజయం, ఆరేపల్లి మోహన్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఇతర ముఖ్య నేతలతో కలిసి శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.
అనంతరం బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేతలు హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించినారు.
ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి పార్టీ నేతలు కార్యకర్తల సమక్షంలో ప్రారంభించినారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కటకం మృత్యుంజయం మాట్లాడుతూ..అజాతశత్రువు ప్రజలు మెచ్చిన నేత శ్రీపాద రావు గారి వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, వారు శాసనసభ స్పీకర్ గా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నేతగా, ప్రజాప్రతినిధిగా మారుమూల గ్రామంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న శ్రీపాదరావు గారు స్వర్గస్తులవడం దురదృష్టకరం, వారు విలువలతో కూడిన రాజకీయాలు చేసి నేటి తరానికి ఆదర్శవంతులుగా ఆరోజు వారు చేసిన అభివృద్ధి వారు చూపిన బాటలో నడుస్తూ వారి తనయుడు గౌరవ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు శ్రీపాద రావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కన్న కలలను సహకారం చేయడమే లక్ష్యంగా వారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నారు, మేమంతా వారి అడుగుజాడల్లో నడుస్తూ కంకణ బద్ధులమై పనిచేస్తామని శ్రీపాద రావు గారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిన బూనుచున్నాము అని, ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ కరీంనగర్ పట్టణంలో పేదల కోసం అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమాలలో నాయకులు ,మల్లికార్జున రాజేందర్, ఎండి తాజ్, కర్ర రాజశేఖర్, బానోతు శ్రావణ్ నాయక్, వరాల నరసింగం, పడుశెట్టి భూమయ్య, వేల్పుల వెంకటేష్, ఆకుల నరసయ్య, గుమ్మడి రాజకుమార్, పర్వత మల్లేశం, చాడ గొండ బుచ్చి రెడ్డి, సరిల్లా ప్రసాద్,కామ్రెడ్డి రాంరెడ్డి, చర్ల పద్మ, మునిగంటి అనిల్ నిహాలైమ్మద్, వంగల విద్యాసాగర్, సుధాకర్ నాయక్, కుంభాల రాజకుమార్, దిండిగాల మధు, వెన్న రాజ మల్లయ్య, బాకారపు శివయ్య, మూల జైపాల్, కల్వల రామచందర్, రాచకొండ ప్రభాకర్, రాచర్ల పద్మ, అస్తపురం రమేష్, కామ్ పెళ్లి కీర్తి కుమార్, సుదర్శన్, పిట్టల రవి, గంగుల దిలీప్, లైక్, జొన్నల రమేష్, రూపు రెడ్డి శ్రీనివాసరెడ్డి, తోట అంజన్న, హర్ష మల్లేశం, దండి రవీందర్,పడాల అజయ్, వీరదేవేందర్, కమ్రుద్దీన్ అబ్దుల్ బారి, సుకూర్, షబానా, నాగుల సతీష్, జ్యోతి రెడ్డి,ఖాజా ఖాన్,కిరణ్, మామిడి సత్యనారాయణ రెడ్డి, శిల్ప, స్వప్నశ్రీ,సద్దాం, ఊరడి లత, ఇమ్రాన్, అనిల్, బత్తిని చంద్రయ్య గౌడ్, ఏజ్రా, జీడి రమేష్, చాంద్,మంద మహేష్, సుంకర గణపతి, మాసూమ్ ఖాన్ సిరాజ్ , వాసు, ఊకంటి రవీందర్ రెడ్డి, అష్రాఫ్ ,తదితరులు పాల్గొన్నారు.