- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాబోవు రోజుల్లో మాధకద్రవ్యాలను నిర్ములించేది నేటి తరం విద్యార్థులేనని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ లో మాదకద్రవ్యాలతో అనర్ధాలఫై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని ఒక మంచి ఉదేశ్యంతో జిల్లా లో ఉన్న విద్యాసంస్థలలో ఉన్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, విద్యార్థుల దృష్టి తమ కెరీర్ మీద మాత్రమే ఉండాలని,నిషేధిత డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సూచించారు. డ్రగ్స్ వాడడం అనేది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని తెలిపారు.మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని అన్నారు. అధిక ఒత్తిడి నియంత్రణ కోసం మత్తు పదార్థాలను తీసుకోవద్దు అని, సన్నిహితుల ఒత్తిడితో చెడు మార్గాల వైపు అడుగు వెయ్యరాదన్నారు. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని పెర్కొన్మారు.ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలను స్నేహితులకు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. మేము డ్రగ్స్ తీసుకొము, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం”అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమం లో డిఎస్పి రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్.ఐ మల్లేశం, డైరెక్టర్ శ్రీధర్ రావు, స్కూల్ ప్రిన్సిపల్ రజిత రావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.