Take a fresh look at your lifestyle.

మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ ఎమ్మెల్యే డా. మైనం పల్లి రోహిత్ రావు మెదక్ లో ముస్లింలకు ఇఫ్తార్

ముద్ర ప్రతినిధి,,మెదక్:
మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం అని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే పవిత్రమైన కాలమన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనసును పవిత్రం చేసుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముస్లిం సోదరుల అభ్యున్నతికి విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.

సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప పండుగ అన్నారు. ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సాధించడం, పేదలకు దానం చేయడం వంటి గొప్ప విలువలను రంజాన్ మాసం గుర్తు చేస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలు, వర్గాలు కలిసి జీవించే సంస్కృతికి నిలయమని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తమని తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఇఫ్తార్ లో మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, ఆర్డిఓ రమాదేవి,
ఏఎస్పి మహేందర్, డిఎస్పి ప్రసన్న కుమార్,
మున్సిపల్ మాజీ చైర్మన్ లు తొడుపునూరి చంద్రపాల్, గూడూరి కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్ రావ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాదర్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశరామ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు తొడుపునూరి శివ రామకృష్ణ, గంట సంపత్, శశాంక్, మన్సుర్, హరిత, జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ చౌదరి, బొజ్జ పవన్, మ్యాడం బాలకృష్ణ, గూడూరి ఆంజనేయులు గౌడ్, సలీం, హాఫిజ్, సమీ, మంగ మోహన్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, హంజద్, ముత్యంగౌడ్ ఉమర్, హమీద్ మహేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, శంకర్ గౌడ్, నిఖిల్, ఖాలేక్, తాహెర్, కొండా శ్రీను గుప్తా, బాలరాజ్, దిలీప్, తదితరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం నిరూపేద ముస్లింలకు తోఫాలు అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.