Take a fresh look at your lifestyle.

10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
పదవి తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు.
శనివారం రాయగిరి లోని లింగబసవ గార్డెన్స్ లో ఎస్సీ, ఎస్టీ, బి.సి వెల్ఫర్ విద్యార్థి , విద్యార్థులకు ప్రేరణ సదస్సు కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్దిని, విద్యార్ధులు క్రమ శిక్షణ, నిరంతరం కష్టపడి చదువుతూ పదవ తరగతి పరీక్షలో మంచి ఉత్తీర్ణత మార్కులు సాధించాలన్నారు. పరీక్షల సమయంలో ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య లభించే విరామ సమయాన్ని విద్యార్థుల అభ్యాసానికి ఉపయోగించుకోవాలని సూచించారు. వెనుకబడిన సబ్జెక్టుల పై ఒకటికి రెండు సార్లు చదివి నివృత్తి చేసుకోవాలన్నారు.
తదుపరి పరీక్షకు సంబంధించిన ముఖ్య అంశాల పునశ్చరణ నిర్వహించాలని సందేహలను నివృత్తి చేయాలన్నారు. విద్యార్థుల్లో పరీక్ష భయం లేకుండా అవగాహన కల్పించాలన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమమునకు షెడ్యుల్ కులాల వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాహితి, విద్య శాఖ అధికారి సత్యనారాయణ, ఏబీసీడీఓ, ఏ ఎస్ డబ్ల్యూ ఓలు, ఎస్సీ , ఎస్టీ, బిసి వసతి గృహ సంక్షేమ అధికారులు అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.