ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
రాష్ట్ర ప్రభుత్వం రైతులను, యువకులను, మహిళలను అందరినీ మోసం చేసిందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సోమవారం బిజెపి జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ అధ్యక్షతన స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి అవినీతి మయంలో కురుకుపోయిందని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రజలను గోస పెడుతున్నాయన్నారు. ప్రభుత్వం వడ్లను కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని, రైతుబంధు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తుందని ఎన్నికలబందుగా మారిందన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో బిజెపి దూసుకుపోతుందని, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది బిజెపి పార్టీ నే అన్నారు. ఈనెల 10వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నుండి కార్యకర్తలు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, తుమ్మల మురళీధర్ రెడ్డి, మాయ దశరథ, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, బోయినపల్లి గోపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల యాదిరెడ్డి, కాదురి అచ్చయ్య, చందా మహేందర్, జిల్లా కార్యదర్శులు తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మేడి కోటేష్, లక్ష్మీనారాయణ, కామిటికారి కృష్ణ, జిల్లా మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, దుర్గా పతి లక్ష్మీనారాయణ , బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పకీర్ రాజేందర్ రెడ్డిపట్టణ 5వ వార్డు కౌన్సిలర్ ఎండి యాస్మిన్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి, పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, భువనగిరి మండల అధ్యక్షులు చీర్క సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్ల నర్సింగ్ రావు, సుర్వి శ్రీనివాస్ గౌడ్, వివిధ మండలాధ్యక్షులు పాల్గొన్నారు.