- కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖను ఆయన రాశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రూ. 8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆయన తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని, కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వబోమని చెబుతున్నాయని ఆయన వెల్లడించారు.ఈ పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు. వెంటనే ఫీజు రియంబర్స్ మెంట్ బకాయలను చెల్లించాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.