Take a fresh look at your lifestyle.

ఏరియాను సందర్శించిన కార్పొరేట్ సివిల్ జీఎం

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: సింగరేణి కార్పొరేట్ సివిల్ జనరల్ మేనేజర్ డి. వెంకటేశ్వర్లు గురువారం రామగుండం రెండవ ఏరియాను సందర్శించారు. ఉదయం ఏరియాకు వచ్చిన ఆయన ఏరియా జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య తో సమావేశమై, ఏరియాకు సంబంధించిన సివిల్ పనులు, అనుమతుల నిమిత్తం కార్పొరేట్ లో పెండింగ్లో ఉన్న పనుల అంశాలపై చర్చించారు. కార్పొరేట్ సివిల్ జీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏరియాకి వచ్చిన సందర్భంగా ఆయనను ఏరియా జీఎం వెంకటయ్య ఏరియా సివిల్ అధికారులతో కలిసి శాలువాతో సన్మానించి, పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏరియా సివిల్ డీజీఎం ధనుంజయ, డీజీఎం ఐఇ మురళీకృష్ణ, డివైఎస్ఇ వినయ్ సాగర్ ఇఇ సివిల్ ప్రతాపగిరి రాజు, సివిల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.