Take a fresh look at your lifestyle.

గ్రీన్ కార్ప్స్ విద్యార్థుల విత్తన బంతుల తయారి

 

మహాదేవపూర్, ముద్ర:

మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో నేషనల్ గ్రీన్ కార్ప్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులందరు చింత, సపోటా, రేగు, ఖర్జురా, సీతాఫలం గింజలతో విత్తనబంతులు తయారు చేశారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది.నేషనల్ గ్రీన్ కార్ప్ ఇంచార్జి టీచర్ బి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో విత్తన బంతులు తయారు చేశారు. ఈ విత్తన బంతుల తయారీకి ఎరుపు బంక మట్టి, కంపోస్ట్ ఎరువు మరియు నీళ్లు తగుపాళ్ళలో కలిపి మట్టిని పిసికి ముద్దలు వచ్చేవిధంగా చేస్తూ విత్తనాలను మట్టిలో పెట్టి ఉండలా చుట్టి నీడలో ఆరబెట్టి జాగ్రత్తగా నిల్వ చేసి వర్షాకాలంలో అడవుల్లో విసిరితే వృక్ష జాతి జరుగుతుంది ప్రభాకర్ రెడ్డి వివరించారు.
ఉపాధ్యాయులు రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి,రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్,లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య, శ్రీమతి అనిత, శ్రీమతి కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్ మరియు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి రాజేశ్వర్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫిసర్ సదానందం విద్యార్థులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.